![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -404 లో.... బ్రోకర్ దగ్గరికి మారువేశంలో శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు వెళ్తారు. మా నాన్నకి జాబ్ కావాలని శ్రీవల్లి అడుగుతుంది. అయిదు లక్షలు ఖర్చు అవుతుందని అతను అంటాడు. ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అందుకే తగ్గించానని బ్రోకర్ అంటాడు. నీకు అయిదు లక్షలు ఇచ్చాక మోసం చేయవని గ్యారెంటీ ఏంటని భాగ్యం అడుగుతుంది. ఇదిగోండి నా ట్రాక్ రికార్డు ఇంత మందికి జాబ్ ఇచ్చానని ఫైల్స్ చూపిస్తాడు. అందులో సాగర్ ఫైల్ ఉంటుంది. అది చూసి శ్రీవల్లి వీడియో తీస్తుంది. ఈ అబ్బాయికి ఏం జాబ్ ఇప్పించారని భాగ్యం అడుగుతుంది. రీసెంట్ గా ఇప్పించాను ఇరవై అయిదు లక్షలు అని అతను చెప్తాడు.
సరే మేమ్ అయిదు లక్షలు సర్దుబాటు చేసుకొని వస్తామని భాగ్యం వాళ్ళు అక్కడ నుండి బయల్దేరాతారు. మరొకవైపు సాగర్, నర్మద ఇంటికి వస్తారు. నాన్న మా మావయ్య నాకు జాబ్ వచ్చిందని పార్టీ ఇస్తున్నారు.. మీరు తప్పకుండా రావాలని సాగర్ అంటాడు. ఏం ఘనకార్యం చేసారని పార్టీ అంటున్నావని శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది. దాంతో భాగ్యం ఆపి అంటే మా కూతురు ఉద్దేశ్యం మొన్న అందరి ముందు పరువుపోయింది కదా అని అంటుందని భాగ్యం కవర్ చేస్తుంది. మా మావయ్యకి మీరు వస్తారని చెప్పానని సాగర్ అంటాడు. మిల్ లో మూటలు మోసుకునే వాడు వస్తే నీ పరువు పోతుంది కదా అని అనేసి రామరాజు వెళ్తాడు. నర్మద బాధపడుతుంటే బాధపడకు మీ మావయ్య బాధలో ఉన్నాడని వేదవతి అంటుంది. మావయ్య గారు అన్నందుకు బాధగా లేదు.. నేను కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నానని బాధ అని నర్మద అనుకుంటుంది. మరొకవైపు ఎందుకు అమ్మ అపావని భాగ్యాన్ని శ్రీవల్లి అడుగుతుంది. నాలుగు గోడల మధ్యలో పరువుపోతే ఏం వస్తుందే పార్టీలో పోగొట్టాలని భాగ్యం అంటుంది.
మరొకవైపు ధీరజ్ కార్ కొనడానికి ప్రేమని తీసుకొని షో రూమ్ కి వెళ్తాడు. నువ్వు నిన్న మోటివేట్ చేసావ్ కదా.. నేనే సొంతంగా కార్ కొనుక్కొని డ్రైవింగ్ చేసుకుంటానని ధీరజ్ అంటాడు. మరొకవైపు రామరాజు దగ్గరికి వేదవతి వెళ్లి.. ఎందుకు అంత కఠినంగా మాట్లాడారని అడుగుతుంది. మీరు రాకపోయినా నేను అయిన వెళ్తే బాగుంటుందని వేదవతి అనగానే సరే వెళ్ళు అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |